ఇది నా నేల

నేను పుట్టింది కడప జిల్లా కలసపాడు లో కనిపించే ఈ నేలపైనే…  నేను లోకాన్ని చూసింది ఇక్కడే…నా తొలి జ్ఞాపకం… నా బాల్యం అంతా ఈ గడ్డపైనే…పుట్టిన దగ్గర నుండి పాతికేళ్ళపాటు ఈ కనిపించే గడ్డపై ఉన్నాను… ఒకప్పుడు ఇది ఓ పెద్ద వనంలాగా నిండా చెట్లతో ఉండేది.. కాలక్రమేణా చాలా చెట్లను కొట్టివేశారు.. వాటిస్థానంలో కొత్తవి నాటలేదు… అయితే మిగిలిన నా జ్ఞాపకాల్లాంటి చెట్ల వేర్లు మళ్ళీ మొలకెత్తాయి..ఆ ప్రదేశానికి కాస్త ఉపశమనం కలిగించడానికి… వాటిని ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు నరకరనే నమ్మకం లేదు…అంతే తరాలు మారినట్టుగా భూమి కూడా ఒక్కో రూపాన్ని సంతరించుకుంటుంది..మా సగిలేరు కూడా ఇప్పటి వరకు ఎన్నో అవతారాలను మార్చింది. నేను ఊరు విడిచిన తరువాత మా సగిలేరుకు వడ్డానంలాగా ఓ బ్రిడ్జి అనివార్యమైంది.. దాని వల్ల ఈ ప్రదేశానికి వరద ముప్పు రాకుండా తీసుకునే క్రమంలో ఇలా పెద్దగా కట్ట కట్టవలసి వచ్చింది ఆ సమయంలో తీసిన ఫోటో ఇది. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే మనసు ఉరకలు వేస్తోంది..మరో పక్క గతం గుర్తుకు వచ్చి ఆ జ్ఞాపకాలతో పాటు ఇక్కడే దాదాపు అరవై సంవత్సరాల పాటు  జీవించి.. ఇక్కడే సమాధి అయిన మా అమ్మ మా నాయన లు కూడా గుర్తుకు వచ్చి గుండె చెమ్మగిల్లుతోంది.

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *