” ఈగ దుమారం’

తెలుగు సినిమా పరిశ్రమలోవిలువలు నశించాయి…అనేదానికి ఒక ఈగ సినిమా చాలు..
ప్రస్తుతం సినిమా పరిశ్రమ రెండు సామాజిక వర్గాల వారిగా విడిపోయింది. ఒక సామాజిక వర్గం వారు తీసిన సినిమాను మారో సామాజిక వర్గం వారు బాగాలేదని ప్రచారం చేయడం…ఒక అనారోగ్యమైన… అనాగరికమైన విధంగా ప్రవర్తిస్తున్నారు. తెలుగుసినిమా పచ్చగా ఉండాలంటే…సక్సెస్ కావాలి..అది అన్ని సామాజిక వర్గాల వారికి అవసరం. ప్రస్తుతం ఈగ సినిమా విడుదలైన తరువాత సినిమా బాగా ఉన్నప్పటికి కొందరు
దాన్ని భరించలేకున్నారు. సినిమా ఎలా ఉంది అడిగితే…. నిరుత్సాహంగా ఫరవాలేదు అని బలవంతంగా చెపుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే… రాజమౌళి అనే మన తెలుగు దర్శకుడు తనకు తెలిసిన పరిజ్ఞానంతో ఉన్నత సాంకేతిక విలువలు ఉపయోగించి ఒక వినోదాత్మక సినిమా తీస్తే కొందరు ఆ సక్సెస్ ను తట్టుకోలేని వారు అది కేవలం ఓ యానిమేషన్ ఫిల్మ్ లాగా ఉందనో మరో లాగా ఉందనో కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు రాజమౌళి కి ఇబ్బంది కలిగించే విధంగా… రాజమౌళి మనసులో లేని ఆలోచనను కూడా ఊహించి చెబుతున్నారు. మగధీర సినిమా కేవలం రాజమౌళి టాలెంట్ వల్లనే ఆడింది. అందులో చిరంజీవి కుమారుడు హీరో కావడం వల్ల కాదు అనే కొత్త వివాదానికి తెర తీస్తున్నారు. సరే మరి కొందరు – రాజమౌళి ఈగతో హీరోలను భయపెట్టాడు. అందుకే ఇద్దరు హీరోల సినిమాల విడుదల తేదీలను మార్పుకున్నారు అని ప్రచారం చేస్తున్నారు. అస్సలు మా కన్నడ నటుడు విలన్ గా నటించడం వల్లే ఈ సినిమా ఆడింది అని కన్నడిగులు తమ సైట్లలో ప్రచారం మొదలు పెట్టారు.

ఒక మంచి సినిమా ప్రేక్షకులను వినోద పరిచే సినిమా మన వాడు తీశాడు అని ఆనందపడకుండా… ఇలా లేని పోనివిధంగా బురదజల్లడం విచారకరం.

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *