జీతా బెహ‌ర్ ..మామిడి కాయ‌లు

జీతా బెహ‌ర్ ..మాడి కాయ‌లు

ఈ మామిడి కాయ‌లు చూస్తుంటే నా చిన్న త‌నం గుర్తుకు వ‌స్తుంది .. మా చ‌ర్చికాంపౌండ్ చుట్టూ మూడు మాడి వ‌నాలు ఉండేవి..ఒక దాని పేరు జాప‌ర‌య్య ఒనుం ..ఇంగోదాని పేరు గున్నెసాబ్ ఒనుం ..ఇంగొక దాని పేరు గుడెన‌క ఒనుం ..జాప‌ర‌య్య తోట అయితే మా ఇంటికి ఎన‌క ప‌క్క‌నే ఆ ఒనుంలో బేనిస కాయ‌ల చెట్టు ఒక‌టి ఉండేది . దానిముందే పాడు బ‌డిన బాయి ఉండేది ..మా ఇంటికి వెన‌క ప‌క్క ఒక పెద్ద టెంకాయ చెట్టు ఉండేది .అంటే అది కూడా జాప‌ర‌య్య వ‌నంలో ఉండేది ఆ చెట్టు ఎక్కాలంటే సాధ్యం కాదు.. చాలా పెద్ద చెట్టు .. ఆ చెట్టు త‌ప్ప ఆ ఒనుంలో ఉండే చెట్ల‌న్నీ ఎక్కాను..స‌రే ఆ చెట్టుకు టెంకాయ‌లు కాసేవి..కాయ‌లు పుట్టిన‌ప్ప‌టినుండి పెద్ద‌గా అయ్యే వ‌ర‌కు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టే వాడిని .. అంటే పెద్ద‌గా కాసేది మ‌హా అయితే ఒక ప‌ది కాయ‌లు .. ఆ కాయ‌లు పండి ఎండిపోయి రాలి పోయే వ‌ర‌కు అన్న‌మాట.. ఉద‌యం లేవ‌గానే మా దొడ్లోకి పోయి బొగ్గుతో క‌స‌క‌సా పండ్లు తోముకుంటా ఆ టెంకాయ‌లు ఎంచే వాడిని ఒక్క‌టి త‌గ్గిందా మా దొడ్డి గోడ దూసి కంప‌చెట్ల‌లో దూరి టెంకాయ చెట్టు మొద‌లు ద‌గ్గ‌ర‌కు వెళ్ళి ఆ కింద ప‌డిన టెంకాయను తెచ్చుకునే వాడిని. ..అది ఒక జ్ఞాప‌కం
అయితే ఇంకోటి ఉంది ఈ రోజు మార్కెట్ కు వెళితే ఒకే ర‌కం మామిడి కాయ‌లు నాలుగు గోనె సంచుల‌కు వ‌చ్చాయి.వాటిని చూస్తానే ఎందుకో మ‌ళ్ళీ బాల్య జ్ఞాప‌కాలు మామూలుగా అయితే మామిడి కాయ‌లు సీజ‌న్ లోనే కాస్తా ఉంటాయి.. గున్నెసాబ్ వ‌నంలో ఒక రకం మామిడి చెట్టుకు సీజ‌న్ అయి పోయినా కాయ‌లు కాసేవి..వాటిని తెంపుకుంటే భ‌లే ఆనందంగా ఉండేది. వాటిని పైర గాయ‌లు అంటారు.ఈ రోజు నేను మార్కెట్ లో కొన్న మామిడి కాయ‌ల పేనే అడిగాను..మామిడి కాయ‌లు అమ్మే అత‌ను ఈ కాయ‌ల గురించి చెపుతూ వీటిని జీతాబెహ‌ర్ అని అంటారు. అంటే ఈ కాయ‌లు సంవ‌త్స‌రం అంతా కాస్తుంటాయి అని చెప్పాడు .. ఈ విష‌యాన్ని మిత్రుల‌తో షేర్ చేసుకుందామ‌ని స‌గిలేట్లో ఈ పోస్ట్ పెట్టాను.m1

Save

Save

Save

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *