నా అక్షరాభ్యాసం ఓ జ్ఞాపకం

నన్ను బడికి పంపిన రోజు నాకు బాగా గుర్తు…ఆరేండ్లకో ఏడేండ్లకో….తెల్దు గాని ఉతికిన గుడ్డలు వేసి నెత్తికి ఆందం పెట్టి తల దువ్వి…ఒక పలక… ఒక కొత్త బలపం కొనిచ్చి మా నాయన నన్ను బడికి పిలసక పోయినాడు.. ఒకటో తరగతిలో చేర్పించినాడు మానాయన గూడా అదే స్కూల్లో టీచర్ . అప్పటికే మా యక్కలు ..మా యన్నోల్లు అదే స్కూల్లో సదివి దాట గొట్టుకోని పొయినారు. ఈ ఫోటోలో కనిపించే దానికి ఎదురుంగానే మా ఇళ్ళు ఉన్నెది… (ఆ బోదకొట్టం అంటే నాకు ఎంతో ఇష్టం
భయం కూడా దాని గురించి ఒక కథ రాస్తాను త్వరలో)  ఫోటోలో కనిపించే దాన్ని హాలు అనేవారు…హాలు వరండాలో చిన్న రూమ్ లాంటిది కట్టారు…నా చిన్న తనంలో అది ఉండేది కాదు. అక్కడ ఒకటో తరగతి ఉండేది. జీవమ్మ టీచర్ ఒకటో తరగతికి టీచర్ గా ఉండేది. ఆమె నాకు ముందే తెలుసు గాబట్టి రారా చిట్టోడా…బాగా చదువుకోవాలి అని చెప్పింది..పలక తీసుకుని అ ….ఆ అనే అక్షరాలు బలపం తో పలక నిండా రాసిచ్చింది. దాన్ని నేను ఆ రోజంతా దిద్దుకుంటా కూచ్చున్నాను..అప్పటి దాకా ఆడుకుంటా ఉన్నె నాకు రోజూ బడికి పోవడం సదువు కోవడం ఒక్కరవ్వ ఇష్టం లేక పోయినా కూడా బడిలో టీచర్లు  పాటలు పాడించడం… ఆటలు ఆడించడం లాంటివి నాకు నచ్చేవి. ఒకటో తరగతి తరువాత రెండో తరగతి .. మూడవ తరగతి హాలు పక్కనే ఒక రెండు అరల పెంకుటిల్లు ఉండేది…దాంట్లో చదివాను…నాలుగో తరగతికి ఇంకో వారపాకులో చదివాను.. ఐదో తరగతి మళ్ళీ ఈ హాలు లోనే చదివాను.. ఆరు… ఏడు పెద్ద బంగళాలో చదివాను. నా చిన్న నాటి జ్ఞాపకాల్లో ఆ కాంపౌండ్ లో ఇదొక్కటి మిగిలింది…..

Save

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *