బిక్కి పండ్లు

ఈ ఉద‌యాన్నే ఇందు ట్రావెల్స్ బ‌స్ లో మా ఊరు క‌ల‌స‌పాడు నుండి నా స్నేహితుడు నా బావ పెట్లు వ‌ర‌ద‌రాజులు కొడుకు నాని తీసుకుని వ‌చ్చాడు..మా ఇంటి ద‌గ్గ‌ర నేష‌న‌ల్ హైవే మీద బ‌స్ ఆపి మ‌రీ ఇచ్చి పోయాడు. బిక్కి పండ్లను పంపింది నా ద‌త్త పుత్రుడు టీటు .. వాడు మొన్న నేను క‌లేపండ్ల పోస్టింగ్ పెడితే అవి చూసి ..ఆ పోస్టింగ్ లో బిక్కి కాయ‌లు పెట్టి బాబాయ్ ఇయ్యో బిక్కి కాయ‌లు అన్నాడు .. వ‌రే నా కొడ‌కా పోస్టింగ్ పెడితే ఎట్ట‌రా నాకు బిక్కి కాయ‌లు కావాల అంటే ..పంపిచ్చాలే బాబాయ్ అని నిన్న అదే ప‌నిగా చెన్నుప‌ల్లె అడవిలోకి పోయి బిక్కి కాయ‌లు కోసుకోని వ‌చ్చి ఫోన్ చేసినాడు బాబాయ్ రాత్రికి బ‌స్ కు పంపుతాను లే అని ..ఎన్ని దొరికినాయిరా సుమారుగా దొరికినాయిలే బాబాయ్ ఒక ప‌డి ప‌డిన్న‌ర ఉంటాయి అన్నాడు .. ఇక్క‌డ కెజీల‌కు అల‌వాటు పడ్డ నేను వాడు ప‌డి అని అన‌గానే భ‌లే ఆనందం అనిపిచ్చింది ..ప‌డి…అర‌పడి.పావు ..అర‌పావు ..ఈ మాట‌లు ఇని ఎన్నాళ్ళ‌యిందో ..అట్ట‌నే బిక్కి పండ్ల సంచి శేతిలోకి తీసుకోని వాస‌న జూచ్చి అబ్బ ఎన్ని దినాల‌యిందో ఈ బిక్కి పండ్ల వాస‌న చూసి ..అడ‌విలో స్వ‌చ్చందంగా పెరిగిన పండ్లు ..ఎలాంటి ఎరువులు ఫ‌ర్టిలైజ‌ర్స్ లేకుండా కాసిన కాయ‌లు వాస‌న గుమాయిచ్చింది. ఇంగ తెలుసుగా ఆ వాస‌న సూడ‌గానే నా మ‌న‌సు మా ఊరి మీదికి పోయింది..ఇంగ మామూలే మా య‌మ్మ నాయ‌న‌లు..నా చిన్న నాటి స్నేహితులు ..మా ఊరు .. మా ఊర్లో ఉండే మా వాళ్ళు .. ఇట్ట ఒక్క‌టేంది అన్నీ మ‌తికి వచ్చినాయి..ఈ నెక్క మ‌ళ్లా జ‌న్మ అంటూ ఉంటే అదే ఊర్లో పుట్టాల‌నిపించింది. ఉద‌యాన్నే గుండె త‌డి బారింది..క‌న్నీళ్ళు క‌నుకొనుక‌ల కాడికి వ‌చ్చి కార‌డానికి కొటక లాడ‌తా ఉండాయి లే …WP_20150827_001 WP_20150827_002

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *