రైతే దేవుడు

polalu
శాన్నాళ్ళకు మా వూరికి పోతి. తెల్లారు జామునే బస్టాండ్ లో దిగి అబ్దుల్లా టీ బుంక్ లో ఉడుకుకుడుకు టీ వూడుకుంటా తాగి గొల్లీది ఎంట నడుసుకుంటా ఇంటి దావా బడితి ..బస్టాండ్ కాన్నింది మా ఇంటికి పోడానికి రెండు దోవలు ఉండాయి ..ఒకటేమో కొమితోల్ల బజారు ..రెండోది గోల్లీది దావ..నాకు గోల్లీది దవంబడి పోడ మే ఇష్టం…ఎందుకంటే ఆ ఈది లో బరుగోడ్లు ….మేకలు ..గొర్రెలు …మేకలు పోదాన్నే ఎల్లబారి మిట్టకు పోతంటాయి ..నా సిన్నప్పుడు గొల్లీదికి పలు కొనుక్కోడానికి పోతాంటి..ఆడ అక్బర్ సాబ్ పొద్దన్నే ఏసే పొంగనాలు ఎర్రగడ్డ కారెం అంటే బో ఇష్టం…పొద్దన్నే పాలకు బయలు దేరేప్పుడే మొకం కడుక్కొని చెంబు తీసుకొని పాలకు పొయ్యి అంతకు ముందు రోజే దపెట్టుకున్నే అయిదు పైసలు తో పొంగానాలు కొనుక్కొని పాన్కుంట ఉంటి ఆ జ్ఞాపకాల కోసం ఎప్పుడు మా వూరికి పోయినా నేను అదే దావంబడి…ఇంటికి పోతాను…
శాన్నల్లయింది వూరు జూసి వూరు ఏమి మారలేదు కాక పోతే అందరి చేతిలో సెల్ ఫోన్ లు కొట్టగా వచ్చి చేరినాయి ..సెల్ లో పాటలు ఇనడం..అట్లాడుకోడం లో పిల్ల నాయాళ్ళు బిజీ గ ఉండారు …ఆడోల్లు గడ్డికి పొయ్యే గంప లలో సెల్ ఫోన్ లు పెట్టుకొని పాటలు ఇంటా పోతండారు..
ఇంటికి పోతానే బాగ్ ఇంట్లో పడేసి లుంగీ కట్టుకొని టీ షర్టు ఏసుకొని సగిలేరు దావ బడితి …సిటీ లో ఉదయాన్నే ఇంట్లోనే కక్కాసు ఉంటది అన్నే తినడం అన్నే ఇద్సడం కాని వూర్లో అయితే ఏ సేని గట్టుకో లేకుంటే ఎటి గట్టుకో పోతే ఆ ఆనందమే వేరు నేను ఎటి గట్టంబడి పోయి పని గానిచ్చుకోని..ఇంటిదావ పడదామని వచ్చిన దోవ కాకుండా అడ్డ దోవ పడితి..ఆ దావంబడే ఎటికి ఆనుకోని ఎంక రెడ్డి అయ్య తోట ఉండాది …(వూర్లలో కుల మతాలకు అతీతంగా వరసలు పెట్టుకుని పిలుసు కుంటారు నన్ను అయన కొడుకు అని పిలుచ్చాడు సిన్న ప్పటి నుండి ) అయన రాత్రి పగలు శేనికాన్నే ఉంటాడు ..ఆయనకు పొలం అంటే బో పానం ..నన్ను జూసి గుర్తు పడతాడో లేదో అనుకుంటి ..నన్ను దూరం నుండే జూసి ఏమి నాయన బాగుండావా అని పలక రిచినాడు బాగుండాను య్య మీరెట్ట ఉండారు ఐ అడిగితే మాదేముందిలే నాయన యవసాయం జేసుకుండే టొల్లము..అని కోడలు పిల్లోల్లు అందరు వచ్చినార అనే అడిగే అందరం వచ్చినమయ్య అని చెప్తి..ఆడ ఏమి ఉద్యోగం జేచ్చండావు..జీతం ఎంతోచ్చది అని అన్ని అడిగినాడు ..అత్తా అడుగుతానే ఇన్ని కండి కాయలు ..అలసంద కాయలు పెసర కాయలు కోసి కపిల బాయి బండ మీద పెట్టినాడు ..యాప శేట్టు తీగకు ఎలాడుతాన్న సోరకాయను జూసి బో లేత గ ఉంది కదయ్యా..అంటే గబక్కున కోసిచ్చి నాడు..ఎందుకు లెయ్య అంటే తీసక పోయి శియ్యల్లో ఏసీ వండిచ్చు కో బో కమ్మ గుంటది అన్నాడు ..బండ మీద పోసిన అలసంద కాయలు కంది కాయలు ..పెసర కాయలు తీసక వచ్చి నా లుంగీ వాడి పట్టమని చెప్పి వొడిలో పోసినాడు..నేను అవి తీసుకున్నాను గాని జేబిలో లెక్క ఏమి పెట్టుకొని రాక పోతినే ఎంకరెడ్డి య్య కు ఇయ్యదానికి అనుకుంటి …ఆయన్ని తీసుకొని య్యా లెక్క ఏమి జోబిలో పెట్టుకొని రాలేదు మల్ల వచ్చేతప్పుడు తెచ్చాలే అన్నాను ..దానికి ఆయన నన్ను అసహ్యంగా చూసి నా కోడకల్లరా మీది కాదులేరా తప్పు ఆ పట్నానిది ఆడ గడ్డి గూడ లెక్కిచ్చి కొనాల్సిందే గదా అందుకని నాకు లేక్కిజ్జ మనుకున్నావు గదా …పల్లెల్లో రైతు ఇంగ బతికే ఉండాడు రా అనె..నాకు సిగ్గు పోయింది ..నోట మాట రాలేదు నా పరిస్థితి అర్థం చేసుకున్న అయన పోయి అయి వుడకేసుకుని తినుపో అన్నేడు ..నాకు అప్పుడు అనిపిచ్చింది నిజంగా రైతు కంటే గొప్ప వాడు లేడని..అది ఎప్పుడు మతికి వచ్చినా మా ఎంకరెడ్డ య్య మతికి వచ్చి కళ్ళ లో నీల్లుతిరుగుతాయి

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *