వెన్నెల గువ్వ 1

guvva

వెన్నెల గువ్వ ..పూర్తి కథ

 

అత‌డి రాక తెలుసుకుని తుర్రున ఎదురు వెళ్ళింది వెన్నెల గువ్వ
మూల మ‌లుపు తిరుగు తుండ‌గానే అత‌డికి ఎదురు వెళ్ళింది
అత‌న్ని చూసి సిగ్గుల మొగ్గ‌యింది…రా గూడు చూద్దువు గాని
అని అత‌డిని వెంట తీసుకు బ‌య‌లు దేరింది.. కాలి బాట ఒక‌రి
వెన‌కాల ఒక‌రు న‌డ‌వాల్సిందే …జీవితంలో కూడా అంతే
కాని ఇద్ద‌రి దారులు వేర‌య్యాయి…ఇన్నాళ్ళ త‌రువాత
ఇద్ద‌రు జీవిత‌పు ర‌హదారిలో అత‌డి వెన‌క వెళ్ళ వ‌ల‌సిన తాను
ఇప్పుడు తాత్కాలిక కాలి బాట‌లో తాను ముందు వెళుతోంది
త‌న గూడు చూపించ‌డం కోసం … గూడు చేరుకున్నారు ఇద్ద‌రూ
వెన్నెల గువ్వ అంది నా గూడు ఎలా ఉంది అన్న‌ట్టు క‌ళ్ళ‌తో
అడిగింది ..అత‌ను కూడా క‌ళ్ల‌తో నీ లాగే నీ గూడు కూదా అద్భుతం అన్నాడు
సిగ్గుతో వెన్నెల గువ్వ క‌ళ్లు ట‌పా ట‌పా కొట్టు కున్నాయి
అత‌డు వెన్నెల గువ్వ‌ను అనుస‌రిస్తూ వెన‌కే గూడు లోకి వెళ్ళాడు …
వెన్నెల గువ్వ అత‌న్నీ అమాంతం అల్లుకు పోయింది..అత‌డు
ఆమెను త‌న‌లో క‌లుపుకున్నాడు…
అన్ని స‌ప‌ర్య‌ల త‌రువాత తాను కుర్చీలో కూర్చున్నాడు….
వెన్నెల గువ్వ చిన్న పీట తీసుకుని వ‌చ్చి అత‌డి కాళ్ళ ద‌గ్గ‌ర కూర్చుంది
అత‌డి మోకాలు పై రెండు అర‌చేతుల‌ను పెట్టుకుని దానిపై త‌న చుబుకం ఆనించుకుని
వెన్నెల గువ్వ విశాల‌మైన క‌ళ్ళు మ‌రింత వెడ‌ల్పు చేసి పెద‌వుల‌ను గోముగా పెట్టి
నీకు ఒక‌టి చెప్ప‌నా అంది …అత‌డు నవ్వాడు ….స‌రే చెప్పు అన్నాడు
ఆమె ఎప్పుడు చెప్పే మాటే చెప్పింది …అత‌డు మ‌న‌సుతో న‌వ్వాడు … మ‌న‌సుతో
పాటు పెద‌వుల మీద కూడా అ న‌వ్వు ప్ర‌త్య‌క్ష మైంది …ఆమె కుడి చేతిని చ‌టుక్కున
చుబుకం కింద నుండి తీసి అత‌డి పిక్క మీద మెల్ల‌గా గిల్లింది..సుతారంగా …..
ఆమె చేసిన చ‌ర్యకు అత‌ను చిన్న ఉలికి పాటు ప‌డ్డా కూడా
ఇద్ద‌రూ న‌వ్వుకున్నారు నాద‌స్వ‌రం. ష‌హ‌నాయి రెండూఒకే సారి మోగిన‌ట్టు
వెన్నెల గువ్వ త‌న విర‌హాన్ని అత‌డికి వివ‌రించింది అత‌డు ఆమె త‌ల‌ను
త‌న ఒడిలోకి తీసుకుని నుదిటి మీద త‌న పెద‌వుల‌ను అద్దాడు ఊర‌ట‌గా
వెన్నెల గువ్వ విశాల‌మైన క‌నుకొనుకుల నుండి క‌న్నీరు ఒక్కో చుక్క కారుతోంది
త‌న మ‌న‌సులో గూడు క‌ట్టుకున్న బాధ క‌రిగిన‌ట్టుగా తాను వ‌ర్షించింది
వెన్నెల గువ్వ త‌న గూడులో ఉన్న త‌బ‌లా ను అత‌డి ముందు ప‌రిచింది
దాన్ని తేరి పార చూశాడు …అది వాడి చాలా కాల‌మ‌యింది .ఆ వాయిద్యాన్ని
ముందు శృతి చేశాడు …శృతి స‌రిగా ఉంద‌నుకున్న త‌రువాత త‌న వేళ్ల‌ను
ఆ వాయిద్యం మీద అల ఓక‌గా ప‌లికిస్తున్నాడు . వెన్నెల గువ్వ మెల్ల‌గా
పాటందుకుంది ఆ తాళానికి అనుగుణంగా ..అత‌ను మ‌రింత ఉత్సాహంగా
ఆమె పాట‌కు ల‌య‌బ‌ద్ద‌కంగా తాను శృతి త‌ప్ప‌కుండా వాయిద్యాన్ని ప‌లికిస్తున్నాడు
తాను త‌న్మ‌య‌త్వం చెంది పాడుతూనే నాట్యం చేయ‌డం మొద‌లు పెట్టింది ..అలా ఇద్ద‌రూ
చాలా పాట‌ల‌ను ఇష్టంగా పాడుకుని అల‌సి పోయారు …వెన్నెల గువ్వ అల‌సి పోయి
అత‌ని హృద‌యంలో ఒదిగి పోయింది,…అత‌ను ఆమె చుబుకాన్ని ఎత్తి ఆమె త‌ల‌మీద
త‌న పెద‌వుల‌ను సుతారంగా అద్దాడు ఆ చ‌ర్య‌కు వెన్నెల గువ్వ ప‌ర‌వ‌శించి అత‌న్ని అల్లుకు పోయింది
ఇదిలా జ‌రుగుతుండ‌గానే సూర్య‌డు మెల్ల‌గా త‌న ప‌ని అయిపోయింది అన్న‌ట్టుగా సంధ్య వేళ చ‌క్క‌టి
వెలుగుల‌ను నింపుతూ మెల్ల‌గా చీక‌టిలో క‌లిసి పోయాడు ….సంధ్య‌వేళ వెన్నెల గువ్వ అత‌డికి
చ‌క్క‌టి ఫ‌ల‌హారం తెచ్చి ఇచ్చింది..ఇప్పుడు ఇద్దరూ ప‌క్క ప‌క్క‌నే ఒక‌రి ని ఆనుకుని ఒక‌రు ఆ ఫ‌ల‌హారాన్ని
భుజిస్తూ ఊసులు చెప్పుకున్నారు…తాను అత‌న్ని పొదివి ప‌ట్టుకుని అంది ..నా గురించి క‌విత‌లు రాస్తావుగా
ఏది ఒక క‌విత చెప్పు అనింది… అత‌ను నవ్వాడు ..ఎందుకు న‌వ్వు అంది….నీ విర‌హంలో రాస్తాను గాని
ఇలా నన్ను అల్లుకు పోయి క‌విత్వం చెప్ప‌మంటే క‌ష్ట‌మే అన్నాడు ..ఆమె త‌న వెడ‌ల్ప‌యిన క‌ళ్ళ‌ను గుండ్ర‌గా తిప్పుతూ
అత‌ని ముక్కును త‌న ముని వేళ్ళ‌తో ప‌ట్టుకుని సుతారంగా అలా ఇలా తిప్పింది…. అత‌డి గ‌డ్డ‌పు చివ‌ర‌న త‌న మునిపంటితో
చిన్న‌గా కొరికింది…అత‌డి గొంతును తడుముతూ శివుడికి గ‌ర‌ళం ఉన్న‌ట్టు నీకు కూడా ఉందా అని అడిగింది..అత‌ను ఆమె
అమాయ‌క‌త్వానికి ..చిలిపి త‌నానికి ముచ్చ‌ట ప‌డుతూ ఈ సారి ఆమె వెడ‌ల్ప‌యిన క‌నుబొమ‌ల మీద ముద్దు కున్నాడు
ముద్దు పెట్టిన త‌రువాత ఆమె క‌ళ్ల‌లో క‌నిపించిన ఆ త‌డి అత‌డు గ‌మ‌నించ‌క పోలేదు …
ఇద్ద‌రు ఒక‌రిని పొదివి ప‌ట్టుకుని ఒక‌రు డాబా మీదికి చేరారు….చంద‌మామ ఆ రోజు ఎందుకో చాలా హుశారుగా ఉన్నాడు
వెండి వెన్నెల కురిపిస్తున్నాడు …
డాబా మీద కి వెళ్ళిన త‌రువాత అక్క‌డున్న ఓక బ‌ల్ల మీద ఇద్ద‌రూ కూర్చున్నారు ఒక‌రి భుజం మీద ఒక‌రు మేను వాల్చి
వెన్నెల గువ్వ చెపుతోంది. త‌న మ‌న‌సుతో అత‌ని మ‌న‌సుతో మాట్లాడుతున్నాప్పుడు కూజితాలు ఏ వైపు నుంచి అర‌చింది
రాత్రి పూట తిరిగే ప‌క్షులు చేసే అల్లరి ..త‌న ఒంట‌రి త‌నం చూసి చంద‌మామ న‌వ్విన వెకిలి న‌వ్వు …పిల్ల తెమ్మ‌ర‌లు త‌న‌ను ఎలా
ఆట ప‌ట్టించింది ..అప్పుడు తాను ఎంత విర‌హిణి అయింది …ఇవ‌న్నీ చెపుతోంది. ..అప్పుడ‌ప్పుడే తుషార బిందువులు
అలికిడి లేకుండా రాల‌డం మొద‌ల‌యింది
ఆమె మాట‌లు వింటూ …అత‌ను మ‌గ‌త లోకి జారుకున్నాడు ..ఆమె త‌న భుజం మీద ఉన్న అత‌ని త‌ల‌ను చాలా ఒడుపుగా
త‌న ఒడిలోకి తెచ్చుకుంది.. అత‌ను మ‌గ‌త‌లోనే ఊ కొడుతున్నాడు ఆమె మాట‌ల‌కు …
వెన్నెల గువ్వ …పండు వెన్నెల‌లో నిండు చంద‌మామ‌ను చూసిన‌ట్టు అత‌ని ముఖాన్ని చూసుకుంటోంది..ఎందుకు నేనంటే ఇంత
మ‌మ‌కారం ఎందుకు నాకు ఇత‌నంటే ఇంత ఇష్టం అనుకుంటూనే అత‌ని ముఖంలో త‌నకు ఇష్ట‌మైన అర్థ చంద్రాకారం లా నుదిటి మీద స‌హ‌జంగా క‌నిపించే ఆ కురుల‌ను నిమురుకుంది. అత‌ని చెంప‌ల‌కు ల‌న చెంప‌ల‌ను ఆనించింది ..అత‌ని నాసిక‌ను నిమిరింది అత‌ని
పెద‌వుల చుట్టు త‌న చూపుడు వేలుతో గీత‌లు గీసింది .అత‌ను గుబురు మీసాల‌కు రోషాలు పోసింది ….ఆమె చేస్ట‌లకు అత‌ని మ‌గ‌త ఎగిరి పోయింది. ఆమెను పొదివి ప‌ట్టుకున్నాడు ….ఆమె అత‌న్ని అల్లుకు పోయింది ..
ఆ డాబా మీద ఉన్న మ‌రుమ‌ల్లె లు . . స‌న్న‌జాజులు …వీరి తాపాన్ని చూసి సిగ్గు ప‌డ్డాయి ….మందారం మూతి తిప్పుకుంది …గులాబీలు
ఇంకాస్త ఎరుపెక్కాయి.. ప్ర‌తి రోజు ఆమె విర‌హాన్ని చూసి త‌మ‌లో తాము బాధ ప‌డుతున్న ఆ పూల‌న్నీ త‌మ ప‌రిమ‌ళాల‌ను వారి ఇరువురి మీదికి పిల్ల‌గాలితో క‌లిపి పంపాయి..ఇప్పుడు అక్క‌డంతా ప‌రిమ‌ళాలే ..వెన్నెల గువ్వ ఆ ప‌రిమ‌ళాలే కాకుండా అత‌ని ప్రేమ ప‌రిమ‌ళ‌లంలో త‌డిసి ముద్ద‌యింది..త‌న విశాల మైన క‌న్నుల‌ను అర‌మోడ్పులుగా చేసి అత‌ని క‌ళ్ళ‌లోకి చూసింది … అత‌డికి ఆమె ఏదో చెపుతోంద‌ని అర్థం అయింది అత‌ను కూడా త‌న కళ్ళ‌తో సైగ చేశాడు ….ఊ చెప్పు అన్న‌ట్టు .ఆమె గొంతు పెగ‌ల‌డం లేదు …మాట‌లు రావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టింది…ఇంత‌టి మ‌ధుర‌మైన ఆనందాన్ని ఇలాగే దాచుకుంటాను జీవితాంతం..అంది ….అత‌ను ఆమె చెంప‌లు నిమిరాడు.. ఆమె నేత్రాలు వ‌ర్షిస్తున్నాయి.. వెన్నెల గువ్వ చెప్పాల‌నుకుంది వేరే ఉంది అది చెప్ప‌డానికి బిడియ ప‌డుతోంది అనేది …అత‌ను అన్నాడు నీ మ‌న‌సు ఏమి చెపుతోందో ..అత‌డి మీసం మీద చెయ్యి వేసి ఏం చెపుతోంది…అంది మూతి ని అలా ఇలా తిప్పుతూ …అలా తెలుసు కాబ‌ట్టే మ‌న మ‌న‌సులు ..త‌నువులు పెన‌వేసుకున్నాయో ..అని అత‌డేదో చెప్ప బోతుండ‌గానే ఇక వ‌ద్దు చాలు ..అంటే అత‌ని పెద‌వుల‌మీద త‌న చేయి అడ్డం పెట్టింది..
కొద్ది సేపు ఇద్ద‌రూ ఎవ‌రికి వారే క‌ళ్ళు మూసుకుని దీర్ఘా లోచ‌న‌లో ప‌డ్డారు.. ఆలోచ‌న ఆనే దానికంటే …ఆ ఆనందాన్ని త‌మ గుండెల్లో దాచు కుంటున్నారు. ..కాసేపు మౌనాన్ని చెరిపేస్తూ చెట్టు మీద ఉన్న ప‌క్షి ఏదో చిన్న అలికిడి చేసింది ….ఇద్ద‌రూ ఇహ లోకం లోకి వ‌చ్చారు..వెన్నెల గువ్వ క‌ళ్ళు తుడుచుకుంది…గొంతు స‌వ‌రించుకుని చిన్న గా ఆలాప‌న ఎత్తుకుంది..మెల్ల‌గా ఎత్తుకున్న ఆ పాట‌లో మాట‌లు చాలా చిన్న‌వే గాని
ఆమె గుండెల్లో గూడు క‌ట్టుకున్న విషాదం …మొత్తం ఆ రాగంలో ప‌లికిస్తోంది… ఆమె క‌ళ్ళు మ‌ళ్ళీ వ‌ర్షిస్తున్నాయి. అత‌డు ఆమెను ఓదార్చాల‌ని చూడ‌లేదు… ఆమె క‌న్నీల్ళు ఆమె భుజాన్ని త‌డుపుతున్నాయి….ఆ క‌న్నీళ్ళ‌లో అంతు లేని ఆవేద‌న‌..తీర్చ‌లేని .బాధ .రాగం సుడులు తిరుగుతోంది…..చాలా సేపు పాడిన త‌రువాత ఆమె పాట ఆపేసింది…అత‌ని నుండి విడిప‌డింది…అంతే ఎంత వేగంగా విడిపడిందో అంత వేగంగా అత‌న్ని ఎద‌ను గ‌ట్టిగా వాటేసుకుంది.. ఇప్పుడు నా బాధంతా తీరి పోయింది ….ఎందుకో తెలుసా ..అత‌ను బ‌దులు ఇచ్చేలోపే ఆమే స‌మాధానం చెప్పింది.. మ‌నం క‌లుసు కున్నాం కాబ‌ట్టి ….నీతో గ‌డిపిన ఈ ఒక్క రోజు చాలు నేను జ‌న్మంతా బ‌త‌క‌డానికి …ఇక ముందు ఒక వేళ మ‌నం క‌లిస్తే అది మ‌న‌కు బోన‌స్ లాంటిది అని చెప్పింది..ఇప్పుడామె నిజంగా వెన్నెల గువ్వే అనిపించుకుంది మ‌ళ్ళీ త‌నమ‌న‌సు రెక్క‌ల‌ను విప్పుకుంది.. …చ‌లి వేయ‌కుండా అత‌న్ని ర‌గ్గులా క‌ప్పుకుంది..ఆ వెన్నెల రాత్రి …ప్ర‌కృతి ప‌ర‌విశించింది. వీరు ఆనంద కేళిలో తేలియాడుతున్న‌ప్పుడ‌ల్లా చంద్రుడు కాసేపు మేఘాల చాటుకు వెళుతున్నాడు సిగ్గు ప‌డుతూ ..చంద్రుడు వెళ్ళి పోయాక సూర్యుడు వ‌చ్చే లోపు అత‌డు వెళ్ళి పోవాలి …
అత‌ను వెళ్ళి పోవ‌డానికి సిద్ద ప‌డ్డాడు…వెన్నెల గువ్వ అత‌నికి కావ‌ల‌సిన‌వన్నీ ఇచ్చింది…త‌న మ‌న‌సును శ‌రీరాన్ని …ఇంకేముందు త‌న ద‌గ్గ‌ర ఇవ్వ‌డానికి..
అంత సేపు ఎంతో గంభీరంగా ఉన్న అత‌డు వెన్నెల గువ్వ‌ను వ‌ద‌లి వెళ్ళ‌డం చేత కావ‌డం లేదు రాత్రంతా …త‌న క‌ళ్ళ‌ను వ‌ర్షిస్తూనే ఉన్న వెన్నెల గువ్వ ఎంతో గంభీరంగా ఉంది..అత‌డు వెన్నెల గువ్వ‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని ….భోరున ఏడ్చాడు..ఆమె ఓదార్చ‌లేదు …సూర్య‌డు వ‌చ్చే స‌మ‌యం కావ‌స్తోంది . . అంది … అత‌డు విడి వ‌డ‌లేక ..విడిప‌డుతూ వ‌డి వ‌డిగా అడుగులు వేసుకుంటూ వెన్నెల గువ్వ గూడును చూసుకుంటూ వెళుతున్నాడు… గూటిలోప‌ల అప్ప‌టి వ‌ర‌కు ఎంతో బాధ‌ను దాచుకున్న వెన్నెల గువ్వ …..అత‌డు చాలా దూరం వెళ్ళాలి ఏడ‌స్తూ పంప‌కూడ‌దు అని అనుకుని దుఃఖాన్ని త‌న‌లో దాచుకున్న వెన్నెల గువ్వ క‌న్నులు పిల్ల కాలువ‌లు అయ్యాయి.. గూడు గోడ ప‌ట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది…ఏదో విర‌హం …ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను మ‌రో ప్ర‌పంచంలో చుట్టుకుని వ‌చ్చిన అత‌డు మ‌ళ్ళీ వ‌స్తాడో రాడో తెలియ‌దు…మ‌ళ్ళీ క‌లుసు కుంటామో తెలియ‌దు..ఏదో తెలియ‌ని బాధ అంతే గూటిలో నుండి తుర్రున బ‌య‌ట‌కు వెళ్ళింది అత‌న్ని మ‌ళ్ళీ ఒక సారి చూడాల‌ని …వెన్నెల గువ్వ వెతుకుతోంది అత‌ను క‌నిపిస్తాడేమో న‌ని అత‌డు మాత్రం జ‌న ప్ర‌వాహంలో కొట్టుకు పోతున్నాడు.. అత‌నికి తెలియ‌దు వెన్నెల గువ్వ అత‌న్నివెతుకుతోంద‌ని … తిరిగింది తిరిగింది లేత భానుడు వ‌స్తాడ‌నే భ‌యం ఆమెలో ఉంది..అంతే చేసేది లేక భానుడు రాక ముందే తాను ఇంటికి వ‌చ్చింది ….ఎప్పుడూ స‌న్న‌టి మంట‌లా వ‌చ్చి ….త‌న‌ను రోజంతా కాల్చి ..గుండ‌ల్లో గాయం చేసి వెళ్ళే భానుడి కోసం ఎదురు చూస్తోంది వెన్నెల గువ్వ నిస్తేజంగా …అత‌డు వెన్నెల గువ్వ‌ను చూడ‌కుండానే మ‌న‌సు ప‌డ్డాడు … క‌లుసుకున్నాడు ….త‌న మ‌న‌సు ఆవిష్కిరించుకున్నాడు .. ఆమె వ‌ద్ద త‌న మ‌న‌సు వ‌దిలేసి …భార‌మైన హృద‌యంతో …కొండంత వేద‌న‌ను మోసుకుంటూ కారుతున్న క‌న్నీరును తుడుచుకుంటూ వేద‌నా భ‌రితంగా వేల కిలో మీట‌ర్లు ప్ర‌యాణిస్తున్నాడు …
భానుడు వ‌చ్చాడు రోజు లాగే ఆమె మ‌న‌సును కాల్చుకు తిన్నాడు …వెళ్ళి పోయాడు …..కానీ అత‌డు ఇచ్చిన ఆనందం తో పోల్చుకుంటూ భానుడి బాధ అస్సలు ఏమి బాధించ‌లేదు . .. వెన్నెల గువ్వ …అత‌ని జ్ఞాప‌కాల‌ను త‌డుముకుంటూ …మ‌న‌సును త‌డుపుకుంటూ …అత‌ని కోసం ఎదురు చూస్తోంది మ‌ళ్ళీ ఎప్పుడైనా వ‌స్తాడ‌ని త‌న గూటి లో అత‌ను వెళ్ళిన దారి వైపు చూస్తూ ……

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *