శెక్క బొమ్మ …కథ

నా శిన్న త‌నాన ఒక సారి ..మా నాయ‌న ఏడు రూపాయ‌లు లెక్క ఇచ్చి ఊల్లోకి పోయి కిర‌స‌నాయ‌ల్ తెమ్మ‌ని శెప్పినాడు..నేను కిర‌స‌నాయ‌ల్ డ‌బ్బా తీసుకోని మా చ‌ర్చి కాంపౌండు నుండి ఊర్లోకి బ‌య‌లు దేరితి.. మా చ‌ర్చి కాంపౌండు ఊరికి ఒక్క‌ర‌వ్వ దూరంగా స‌గిలేరు ఒడ్డున ఉంట‌ది.. ఆ క‌థ మ‌ల్ల చెప్తాను లే … స‌రే డ‌బ్బా శేత ప‌ట్టుకోని దాని మీద ద‌రువేసుకుంటా జాప‌ర‌య్య ఒనుం దాటి పీట‌ర‌న్న వాళ్ళ గ‌డ్డ దాటి మెల్ల‌గా శివాల‌యం మెట్లు వ‌య్యారంగా ఎక్కితి …శివాల‌యం కూడా ఊరికి ఒక్క‌ర‌వ్వ శివ‌రాక‌ర్లో ఉంట‌ది.. నా ఆయ‌మ్మి క‌థ‌ల్లో కూడా శివాల‌యం ఉండాది లే .. శివాల‌యం ద్వ‌జ‌స్థంబం కాడ శెక్కాబొమ్మ (బొమ్మ బొరుసు) ఆడుతాండారు.. అప్పట్లో మా ఊర్లో ఆ ఆట బో న‌డుచ్చాన్నెది లే …అస్స‌లు శెక్కాబొమ్మ ఎట్ట న‌డుచ్చ‌ది అంటే ఒక‌డు శేతిలో పావ‌లా తీసుకుని సూపుడేలు వంచిపెట్టి దాని మీద పెట్టి బొటిక‌నేలుతో ఎగ‌రేచ్చాడు. అది గాల్లో గెర్ర‌న తిరిగి నేల మీద ప‌డీ ప‌డంగానే దాని మీద శెయ్యి మూచ్చాడు.. అట్ట మూసినాంక సుట్టూ ఉన్నె కొంద‌రు కుడి ప‌క్క బొమ్మ మీద ఎడం ప‌క్క శెక్క మీద పందెం కాచ్చారు…ఈ పావ‌లా బిల్ల తిప్పినోడు చూసుకుంటాడు వాడి లాభం చూసుకోని కుడి ప‌క్క బొమ్మ ప‌డింది అనుకో ఎడం ప‌క్క పందెం కాసిన డబ్బులు అన్నీ తీసుకోని కుడిపక్క ఉన్నోళ్ళ‌కు ఇచ్చిమిగిలితే తీసుకుంటాడు లేకుంటే వాడి శేతిలో నుండి ఏసి ఇస్తాడు..అంటే పావ‌లా బిళ్ళ తిప్పిన వాడు కూడా ఆ అదృష్టం మీద ఆదార‌ప‌డ‌తాడు …అట్ట ఆ ఆట సాగుతాంట‌ది.పెద్ద‌గా లెక్క పోయేది ఏముండ‌దు .. రూపాయ రెండు రూపాయ‌లు మ‌హా అయితే అయిదు ప‌ది రూపాయ‌లు కాస్తుంటారు.మ‌హా పోతే వందా రెండు వంద‌లు పోతాంటాయి మ‌నిషి సోమ‌త‌ను బ‌ట్టి లెక్క పోతాంట‌ది…ఇక్క‌డ అన్ని కులాల వారు మ‌తాల వారు ఆడుతాంటారు.కోంటోళ్ళ కాడ లెక్క ఎక్కువుంటది వాళ్ళు ఎక్కువ పందానికి పెడ‌తారు.. అంటే అంద‌రు కోంటోళ్ళు ఆడ‌రు.. వాళ్ళ‌లో కూడా పందెం మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఆడ‌తారు..
ఇక నా క‌థ‌లోకి వ‌చ్చే జారిపోతాన్నె నిక్క‌రు స‌ర్దుకుంటా కిర‌స‌నాయిల్ డ‌బ్బా తీసుకోని ఆడికి పోతి .. ఆడ ఆట ఆడ‌తాంటే కాసేపు నిల‌బ‌డి జూచ్చి .నేను ఫలానా బొమ్మ ప‌డ‌తాది అనుకుంటే బొమ్మ ప‌డ‌తాంది శెక్క ప‌డ‌తాది అనుకుంటే శెక్క ప‌డ‌తాంది. అట్ట‌నే శానా సేపు జూసి నాకాడ ఉండే ఏడు రూపాయ‌ల్లో ఒక రూపాయ బొమ్మ తిట్టు ఏచ్చి బొమ్మ ప‌న్నాది రూపాయికి రూపాయ వ‌చ్చింది. .. గెలుపులో ఉండే ఆనందం బో ఇదిగా ఉంట‌ది లే ..ఈ సారి శెక్క‌మీద రెండు రూపాయ‌లు యేచ్చి రెండు రెండుకు రెండు వ‌చ్చింది..అబ్బ అనుకుని ఈ సారి నా శేతిలో ఉన్నె మొత్తం బొమ్మ మీద ఏచ్చి.. అంతే మొత్తం పోయింది. …ఇంగేముంంది.. లెక్కంతా పోయినాది. కిర్స‌నాయిల్ ఎట్ట తీసక పోవాల‌.. అప్పు ఎవుడు ఇచ్చాడు. ఏడు రూపాయ‌లు అంటే మామూలు లెక్క కాదు … నేను నిక్క‌ర్లేసుకునే నాయాల్ని …నాకు ఎవుడు ఇచ్చాడు .. ఐదు పైస‌లు ప‌ది పైస‌లు అంటే ఇచ్చారు గాని అంత లెక్క ఎవురు ఇచ్చారు. ఇంగ ఎట్ట‌యితే అట్టయింది …మా నాయ‌న లాక తీసుకోని వాంచుతాడు.. ఇంటికి పోతే అని కిర‌స‌నాయిల్ డ‌బ్బా శివాల‌యం మీద ఏసి ఏట్లోకి పోతి .. అట్టాటప్పుడే బీడి తాగాల‌నిపించింది. ఒకాయ‌న కాడ బీడి ఇప్పిచ్చుకోని
స‌గిలేట్లోకి పోయి కంప‌శెట్ల‌ల్లో కి దూరి బీడీ ఎలిగిచ్చి క‌సిగా తాగుతాంటి.. అవి గుబురు కంప‌శెట్లు నేను ఎవురికి క‌న‌ప‌డ‌ను కాని బ‌య‌ట ఉండే వాళ్ళు నాకు క‌న‌ప‌డ‌తారు…బీడిని శివ‌రాక‌రు దాకా గుంజితి ఏళ్ళు కాలుతాంటా దాన్ని ఒక ముళ్ళుకు త‌గిలిచ్చి పెదాలు కాలేదాంక లాగుతాంటి .. అప్పుడే ఒక‌టి జ‌రిగింది. ఏటి ఒడ్డున బ‌రుగొడ్లు గ‌డ్డి మేచ్చాండాయి .. ఒక నాలుగు అయిదు ఉండాయి.. ఒకడు నా కంటే ఒక్క‌ర‌వ్వ పెద్దోడు .. ఏట్లోకి వ‌చ్చి అట్టిట్ట చూసినాడు .. వీడు ఏంద‌బ్బా అట్టిట్ట సూచ్చాండాడు అని నాకు అనుమానం క‌లిగినాది .. వాడు ఎవ్వ‌రు లేరు అనుకున్నాక పంచె తీసి భుజాన వేసుకుని గ‌డ్డి మేచ్చాన్న బ‌రుగొడ్ల లో ఒక దాని ఎనిక్కి పోయి దాన్ని శెర‌స‌డం తిరుక్కున్నాడు ఎత్తు సాల‌డం లేదు అందుక‌ని మునిగాళ్ళ మీద లేసి నిల‌బ‌డుకోని బెద‌రి పోతాన్న బ‌రుగొడ్ల‌ను ఓమ్మ ఓమ్మ ప్రి ప్రి అంటా మెల్లంగా శెర‌స బోతాంటే ఆ బ‌రుగొడ్డు ..మ‌నిషి చేసే ఈన మ‌యిన ప‌నిని అస‌యించుకుంటా ముందుకు జ‌రుగుతాంది. నాకు వాడి అస‌స్త చూసి న‌వ్వు ఆగ‌డం లేదు .. గ‌ట్టిగా నోటికి శేతులు అడ్డం పెట్టుకుని నవ్వు బ‌లవంతంగా ఆపుకుంటి. న‌వ్వి న‌వ్వి క‌ళ్ళంబ‌డి నీళ్ళు వ‌చ్చావుండాయి. ఏట్లో ఎవ్వ‌రు లేరు వాడు నేను బ‌రుగొడ్లు అంతే ..నేను ఇక ఆపు కోలేక కంప‌శెట్ల లో నుండి ఆహా ఆహా …ఎద‌కొచ్చింద‌బ్బా గిత్త అంటి వాడు న‌న్ను చూసి బిత్త‌ర పోయి గ‌బ‌గ‌బా బోసి మొల‌కు అడ్డ పంచె సుట్టుకోని వ‌చ్చి నువ్వు ఎంత సేప‌యింది వ‌చ్చి అన్నాడు .. నువ్వు రాక ముందు నుండి ఈన్నే ఉండాలే..అయినా మ‌న‌కు పాలుఇచ్చే బ‌రుగొడ్ల‌ను ఇట్ట ఎవుర‌న్నా శెరుచ్చారా అని అంటి వాడు నా కాడికి వ‌చ్చి నీకు దండం పెడ‌తా ఎవ్వురికి శెప్పాకు ఇద్దో ఈ ప‌ది రూపాయ‌లు తీసుకో అన్నాడు.. నాకు ఒక్కాసారి పోయిన పానం తిర‌గివ‌చ్చినాది. ఏది గ‌బక్కిన ఇయ్యి అన్నాను వాడు సొక్కా జేబులోనుండి ప‌ది రూపాయ‌లు తీసిచ్చినాడు … ఎవురికి శెప్ప‌వు క‌దా అన్నాడు శెప్ప‌ను తా అని ఆ ప‌ది రూపాయ‌లు తీసుకోని శివాల‌యం కాడికి పోయి ఒకాయ‌న్న‌ను శివాల‌యం మీదికి ఎక్కిచ్చి డ‌బ్బా తీయించుకున్నాను.., నేను అంత లెక్క శెక్కబొమ్మ‌లో పోగొట్టుకోడం చూసిన వాళ్ళు మ‌ల్లా యాడ తెచ్చుకున్నావురా లెక్క అని అడిగిరి. నేను శిన్న‌ప్పుడు బ‌రుగొడ్ల కాసిన బ‌రుగొడ్ల‌తో నాకు అనుబంధం ఉండాది …వాటితో నేను మాట్లాడే వాడిని వాటి మీంద ఎక్కి స‌గిలేట్లో నీళ్ళు దాటేవాడిని ..అట్టాటి వాటిని పాడు జేజ్జామ‌ని అనుకున్న వాడి మీద అక్క‌సు తీసుకోవాలి గ‌దా అంద‌రిని పిలిచి నాకు లెక్క ఇచ్చిన వాడు బ‌రుగొడ్డును ఎట్ట శెర‌సాల‌ని చూసినాడో …చేసి చూపించి అక్క‌డ ఉన్నె వాళ్ళంద‌రినీ బో న‌గిచ్చి .. అంద‌రూ న‌న్ను బో మెచ్చుకుండిరి రానీ నాకొడుకును పై ప‌గ‌ల కొడ‌తాము అనిరి … నేను ఊర్లోకి పోయి కిర‌స‌నాయిల్ పోయించుకోని కొద‌మ శిల్ల‌ర కు ప‌ప్పులు బెల్లం బొరుగులు కొనుక్కోని జేబినిండా ఏసుకోని ఇంటికి పోతి…అది సుత మ‌ల్లా శెక్క‌బొమ్మా ఆడ‌ల్యా…జీవితంలో కొన్ని కొన్ని అలా క‌లిసి వ‌చ్చాంటాయి అని శెప్ప‌డానికి ఈ క‌థ రాచ్చి

( ప‌ల్లెల్లో రేప్‌లు చేసే వాళ్ళు ఇలా ప‌శువుల‌ను రేప్ చేసే వాళ్ళు చెప్ప‌డానికి నోరు ఉండ‌దు కాబ‌ట్టి .. మ‌నిషి ప‌శువుకంటే హీనుడు కాబ‌ట్టి )WP_20150624_001[1]

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *