సీతాఫ‌లం పండ్లు

సీతాఫ‌లం పండ్లు చూస్తే ఒక్కాసారి బాల్యం లోకి మ‌న‌సు జారి పోతుంది…నేను చిన్న‌ప్పుడు తొలిసారి సీతాఫ‌లం చెట్టు చూసింది మా ఊరి జాప‌ర‌య్య ఒనుంలో ఆ ఒనుం క‌ట్ట‌వమీద కంప‌చెట్ల మ‌ధ్య సీతాఫ‌లం చెట్టు ఉండేది … చెట్టు కాయ‌లు కాసే ప్ప‌టికి ఆ చెట్టు అడ‌వి బ‌టానీ తీగ అల్లుకు పోయు ఉండేది ..అక్క‌డ సీతాఫ‌లం చెట్టు ఉంద‌ని కూడా ఎవ్వ‌రికి తెలియ‌దు.. ఆ కంప‌చెట్ల మ‌ధ్య నుండి సొరంగం లాగా చిన్న దారి చేసుకుని అప్పుడ‌ప్పుడు వెళ్లి ఆ చెట్టుకు కాసిన సీతాఫ‌లాల‌ను చూసే వాళ్ళం నేను సోమ‌య్య గాడు …ఆ చెట్టుకు ఓ నాలుగ‌యిదు కాయ‌లు కాసేవి అవి కూడా చాలా లావుగా ఉండేవి ఆ కాయ‌లు రాల‌కుండా నేను వాడు గుడ్డ‌లు క‌ట్టే వాళ్ళం. …. ఆ కాయ‌లు పండినా కూడా కింద ప‌డ‌కుండా ఉండేవి.. చెట్టుమీద‌నే కాయ‌లు మాగిన త‌రువాత తెంచకుండానే అక్క‌డే అలాగే తినే వాళ్ళం .. అబ్బ ఎంత మ‌ధురంగా ఉండేవో నా బాల్యం లాగా IMG_20151004_144629IMG_20151004_144656

Save

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *