సీమ ఎక్కిళ్ళు

Seema-Yekkillu-Title-2

సీమ ఎక్కిళ్ళు
(వ్యాస సంకలనం) – “మాగుటికెడు నీల్లు మాకే…”
“ఇంగన్నాకళ్ళు తెరసకుంటే …
ఎవడి బతుకు వాడిదే…
ఎవడి బతుకు సంబరం వాడింట్లోనే …
కాకుంటే –
సమాధులకు రాళ్ళైనా మిగలవు…
అవ్వ, తాతలు ఎడారిలో మమ్మీలు –
అమ్మికి అబ్బికి బొక్కలాడేందుకు …
దోసిట్నిండా ఇసకే…!!!”

ఏది ఏమైనా …” నాలుగు జిల్లాలే కదా…?
మీకు నీళ్ళెట్లా …?
మీకేం వనరులున్నాయి…?
పది mp సీట్లే కదా …?
ఎట్లా బతుకుతారు…?” అంటూ రక రకాలుగా …ప్రశ్నించే వాళ్లకందరికీ ఒకటే సమాధానం
“మేం ఎట్లా బతుకుతామో ….చెప్పి ….ఒప్పిస్తే తప్ప – మేం విడిగా బతికేందుకు మీరు ఒప్పుకోరా అని అడగచ్చు..
కానీ ఇవన్నీ నిజాలే కదా? ” ఎట్లా బతగ్గలం” అంటూ…దిగులు పడే సీమ వాసులదే సగం సమస్య-
ఇప్పుడు నిజంగా సీమ వాసులకు కావలసింది-
“ఖండాంతరాలకు ఎల్లలు చెదిరిన వేళ…
కర్లో దునియా ముట్టీమే..
విశ్వాంతరాలంలో బావుటా నువ్వే…
అభివృద్ధికి “అవకాశం” పేరు –
శస్త్ర చికిత్స అవసరమైన వేళ …
చిట్కా వైద్యాలొద్దు –
better late than never ” ఒక మోసం -కొన్ని కుట్రలకు చరిత్ర మిగిల్చిన సాక్ష్యం- ” ఒక పుట” నుండి 80 సంవత్సాల క్రిందటి దుస్థితి – దూరాలోచన- నేటికి ఏమీ మారని తనం- కంఠ శోషలై ఎలా మిగిలాయో పుస్తక సాక్ష్యం.
– వత్సలా విద్యాసాగర్

Recommended For You

About the Author: admin

1 Comment

 1. baagundi
  విన్నపాలు
  @@@@@
  చెల్లీ….
  ప్రతి ఎండాకాలంలో
  గుక్కెడు నీళ్ళకోసం
  గొంతులు మండేకాలంలో
  కాసిన్ని నీళ్ళతో
  మా నోళ్ళు తడపండని
  గల్లీ నుంచీ ఢిల్లీ దాకా
  విన్నపాలు హోరెత్తిస్తూ
  ఖాళీ బిందెల్ని చేతబట్టుకుని
  కాళ్ళీడ్చుకుంటూ
  నీళ్ళకొసం మైళ్ళదూరం
  పరుగులెందుకే పిచ్చి తల్లీ….
  కదిలిస్తే
  కాలువలై ప్రవహించే
  జీవనదులు “గంగా,యమున”ల్ని
  మీ కళ్ళ వెనుకే దాచుకుని,
  పైగా “నర్మద ,సరస్వతీ ,మంజీర” అంటూ
  దేశంలొని అన్ని నదులపేర్లూ మీరే పెట్టుకుని *
  –వేంపల్లి రెడ్డి నాగరాజు*
  9985612167

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *