సురేష్ బాబు ఛాంబర్ ఎన్నికలనుండి తప్పుకోనున్నారా ?

ప్రస్తుత ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ఈ నెల 29 న జరుగనున్న ఫిలిం ఛాంబర్
ఎన్నికలలో పోటీ చేసే యోచనను విరమించినట్లు ఫిలింనగర్ వర్గాలు చెపుతున్నాయి. పెద్ద నిర్మాతలు
చిన్న నిర్మాతలకు మధ్యన ఎప్పటి నుండో వివాదం రగులుతున్న విషయం విదితమే… కాగా ఈ సారి
చిన్న నిర్మాతలకు దాసరి సపోర్టు చేస్తుండడమే కాకుండా నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను
తన తరుపున అధ్యక్ష పదవికి పోటీకి పెట్టారు. పెద్ద నిర్మాతలుగా ఉంటూ థియేటర్లను తమ ఆధీనంలోఉంచుకుని చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారనే అపవాదులు ఎదుర్కొంటున్న నిర్మాతలు డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్
రాజులు ఒక జట్టుగా ఏర్పడి ఈసారి కూడా ఫిలింఛాంబర్ అధ్యక్షపదవిని తాము దక్కించుకునేందుకుప్లాన్ చేశారు. వారి సరసన దాసరికి ప్రియ శిశ్యుడిగా పిలవబడేసి.కళ్యాణ్ చేరి ఆ వర్గం నుండి అధ్యక్షపదవి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.ఇరు వర్గాల వారు పోటా పోటీగా మీ ఓటు మాకే వేయండని ఫోన్లు యస్.యం.యస్ ల ద్వారా  ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు.ఈనేపధ్యంలోసురేష్బాబు ఈ ఎన్నికల నుండి తప్పుకుంటున్నారని ఆయన వర్గానికి సంబందించినసన్నిహిత వర్గాల వారు వెళ్ళడించారు. ఆయన ఆ ప్యానల్ తరుపున పోటీ చేయడానికి సుముఖంగాలేరా.. లేక పోతే ఆయన బయట ఉండి కథ నడిపిస్తారా అనేది ఇంకా తెలియదు. సురేష్బాబు పోటీచేయకూడదు అనే నిర్ణయం వెనుక ఇంకా ఏదైనా కోణం ఉందా అనేది తెలియవలసి ఉంది.

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *