chalam athma katha

chalampic
చలం ఆత్మకథ
తన మార్గాన్ని తానే … వెతుక్కుంటూ ఒక వ్యక్తి – ఒక జీవిత కాలంలో ప్రయాణించ గలిగినంత – దూరం…ప్రయాణించిన ..ప్రేమర్షి చలం ఆత్మకథ.

ఆత్మ కథలంటే నాకు అసహ్యం, నాఆత్మకథ రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషి అయినట్టు, తానేదో ప్రజలకు తీరని ఉపకారం చేసినట్టు తన సంగతి చెప్పుకోక పోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు తెలియకపోతే లోకానికేదో నష్టమైనట్టు అనుకుంటున్నాడన్న మాట రాసినోడు.
ఎందుకు పుట్టానా ? పుట్టిన వాడిని చప్పున చావక ఎందుకింత కాలం తన surroundings ని ఇంత కల్మషం చేశామా అనుకునే నా వంటి వాడు తన కథను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడంటే ఏ మాత్రం క్షమింప దగిన విషయం కాదు. అయినా ఆ పని జరుగుతుందంటే, ఏదీ మన చేతుల్లో లేదన్న మాట. పైగా ఇప్పుడు కళ్ళు కనపడవు.
నా చెయ్యి కలం పట్టుకోలేదు. నా చెయ్యే నా మెదడు. నా వేళ్ళ లోంచి తప్ప నా ఆలోచనలు పలుకవు. నేను అనుకున్నది అక్షరాల్లోకి రావటం లేదు. అయినా ఈ పుస్తకం తయారవుతోంది. దీనికి immediate cause
“విశ్వం” ఇతను సెలవు పెట్టి కూచుని సౌరీస్ ని enconrage చెయ్యటం, అటు తరువాత నర్తకి innocent గా చూడవచ్చిన భారతిని పట్టుకుని ఈ పనిలో ప్రవేశ పెట్టడం ఆ భారతి తను ఈ పని కోసమే పుట్టినట్టు తన ఏకైక బాధ్యత కింద తీసుకుని ఆ పనిని పూర్తి చెయ్యటం ఆమె ప్రారబ్ధం అని తప్ప ఇంకే విధంగానూ యోచింపలేను.
-చలం
అరుణా చలం 30-12-1972

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *